TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో శని త్రయోదశి సందర్భంగా ప్రదోష నందిసేవ ఘనంగా జరిగింది. శనివారం ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు దీప, ధూప, నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నంది వాహనంపై స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు.