Vsp: విశాఖ బీచ్ తీరప్రాంతాన్ని పరిశుభ్రతతో మరింత అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అధికారులతో భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ వంటి ఈవెంట్ల నేపథ్యంలో దేశ విదేశాల అతిథులు రానున్నందున నగరాన్ని సుందరంగా ఉంచాలని సూచించారు.