KMM: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న సీపీఎం అభ్యర్థులను ఎన్నుకోవాలని, పార్టీ మండల కార్యదర్శి కొమ్ము శ్రీను పిలుపునిచ్చారు. మండలంలోని పిండిప్రోలు, పాపాయిగూడెం గ్రామాలలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు.. మండలంలో అనేక సమస్యల పరిష్కారానికి పార్టీ కృషి చేసిందని అన్నారు.