BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది.దసరా సెలవులు కావడంతో తమ ఇష్ట దైవాన్ని దర్శించుకునేందుకు క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. కొండకింద వ్రత మండపం, కళ్యాణ కట్ట, కొండపైన తిరువీధుల్లో,ప్రసాద కౌంటర్లో భక్తుల సందడి కొనసాగుతోంది.భక్తులకు ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.