NLR: ఆటో డ్రైవర్ల కష్టాలను దగ్గరగా చూసి చంద్రబాబు వారి కోసం ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టారని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఇందులో భాగంగా శనివారం నెల్లూరు నగరంలో ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి ఆర్థికంగా భారమైనా రూ.466 కోట్లు ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు.