కోనసీమ: అమలాపురం పట్టణంలో కొలువైన శ్రీదేవి అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 13వ రోజు శనివారం వారాహి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.