GNTR: ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకం ఇవాళ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.15 వేల చొప్పున నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. దీని ప్రారంభోత్సవ సభకు హాజరయ్యేందుకు పెదకాకాని మండలం నుంచి ఆటో డ్రైవర్లు ప్రత్యేక బస్సులో విజయవాడకు తరలివెళ్లారు. ఏర్పాట్లను మండల ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పర్యవేక్షించారు.