E.G: అనపర్తి మండలం కుతుకులూరులోని కుటేశ్వర స్వామి ఆలయం వద్ద రూ.30 లక్షలతో నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.