NDL: ఆదోనిలోని అన్న క్యాంటీన్లో మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ శనివారం ఉదయం తనిఖీ చేశారు. క్యాంటీన్లలో పరిశుభ్రత, వంట నాణ్యత, సరఫరా విధానాలను పరిశీలించారు. తక్షణమే సమస్యలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టాఫ్క సూచనలు ఇచ్చారు. ప్రజలకు భద్రమైన, సురక్షితమైన భోజనం అందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పేర్కొన్నారు. లేని పక్షంగా కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.