KKD: ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) కార్యాలయం వద్ద నుంచి భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల ఆర్థిక సహాయం అందిస్తున్న సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు.