AKP: కిరాణా, టీ హోటల్స్, ఫ్యాన్సీ, కూరగాయల షాపుల వద్ద పరిశుభ్రత పాటించాలని డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ సూచించారు. శనివారం ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరు, తిమ్మాపురం గ్రామాల్లో షాపుల వద్దకు వెళ్లి యజమానులకు అవగాహన కల్పించారు. చెత్తను డస్ట్ బిన్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలన్నారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.