KMR: జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి గత నెల 4న పర్యటించి, పంటలు, రోడ్లు పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రోడ్లు, వంతెనల మరమ్మత్తులకు దాదాపు రూ.350 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. సీఎం హామీ ఇచ్చి నెల రోజులు కావస్తున్నా, ఆయన ప్రత్యేకంగా రివ్యూ చేయకపోవడం, అలాగే నిధులు విడుదల కాకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసింది.