తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించిన సినిమా ‘మిరాయ్’. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. జియో హాట్స్టార్ వేదికగా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుకుబాటులోకి రానున్నట్లు సదరు సంస్థ ఓ పోస్టర్ విడుదల చేసింది.