NLR: పాతూరులో బైకు ఢీకొని అంగన్వాడీ కార్యకర్త సమాధి మంజూల మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. విధి నిర్వహణలో మధ్యాహ్నం విరామ సమయంలో భోజనం చేసి అంగన్వాడీ కేంద్రానికి వెళ్తుండగా, ఒక వ్యక్తి అతివేగంగా ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.