ప్రకాశం: జిల్లాలో వాహనమిత్ర స్కీమ్‌లో 12493 ఆటో డ్రైవర్లు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్నారు. కాగా వీటిని పరిశీలించిన అధికారులు 11,356 అప్లికేషన్లను మంజూరు చేశారు. వీరి ఖాతాల్లో మొత్తం రూ.17కోట్ల 3లక్షల 40వేల నగదు జమ కానుంది. వివిధ కారణాల వల్ల పలువురిని తొలగించగా, మరికొన్ని హోల్డ్ లో ఉంచినట్లు సమాచారం. అర్హత గలవారికి నేడు రూ.15 వేలు జమ కానుంది.