E.G: గోకవరం మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉపాధి శ్రామికులు వాపోతున్నారు. కావున సంబంధిత అధికారులు ఉపాధి హామీ పనులను ప్రారంభించి ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఇతర మండలాలలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయని ఉపాధి శ్రామికులు పేర్కొన్నారు.