KDP: కలసపాడు మండలంలోని సిద్దు మూర్తి పల్లె నుంచి వెంకటాపురం గ్రామం వరకు రూ. 3 కోట్లతో నూతన రోడ్డుకు బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జ్ రితేశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మూడు నెలల్లో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బంది పడ్డారని విమర్శించారు. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ రహమతుల్లా ఉన్నారు.