ASR: ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ శుక్రవారం రాత్రి అధికారులను ఆదేశించారు. తారాబు జలపాతానికి సంబంధించిన అభివృద్ధి, రోడ్డు పనులను చేపట్టేందుకు డీపీఆర్ రూపొందించాలని పీఆర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులను ఈఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు.