VSP: రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. రూ.55 వేల కోట్లతో విశాఖలో ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో తమ బినామీల భూములను కాపాడుకునేందుకే రైతుల పేరుతో కోర్టులో కేసులు వేస్తున్నారని శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో మండిపడ్డారు.