BDK: దమ్మపేట మండలంలో నేడు రాష్ట్రస్థాయి ఆయిల్ ఫామ్ రైతుల సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలిపారు. తెలంగాణను ఆయిల్ ఫామ్ హబ్‌గా మార్చడానికి భవిష్యత్తులో చేపట్టవలసిన కార్యచరణపై ఈ సమ్మేళనంలో చర్చించనున్నట్లు అధికారులు వెల్లడించారు.