NRPT: భారీ కేడ్ ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన మరికల్ మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్సై రాము తెలిపిన వివరాల మేరకు.. మద్వార్ గ్రామానికి చెందిన కురుమూర్తి మండల కేంద్రంలో కోళ్ల వ్యాపారం చేసేవాడు. వ్యాపారం ముగించుకుని ఇంటికి వెళ్తుండగా సబ్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేసిన భారీ కేడ్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు.