KMR: బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు బాస బాల్ కిషన్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవ చిత్రం రావి ఆకుపై చిత్రీకరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఏర్పడి వంద ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా చిత్రం వేసినట్లు బాల్ కిషన్ శుక్రవారం తెలిపారు. ఈ చిత్రాన్ని చూసి ప్రజలు బాస బాల్ కిషన్‌ను అభినందించారు.