PDPL: రామగుండం కోదండ రామాలయంలో రూ. 50 లక్షలతో నిర్మించనున్న గాలి గోపురం భూమిపూజలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గురువారం పాల్గొన్నారు. ఏడాదిలోపే గోపుర నిర్మాణం పూర్తవుతుందన్నారు. ఆలయం చుట్టూ 12 అడుగుల ప్రహరీ గోడ నిర్మాణం కూడా ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానన్నారు.