MNCL: మందమర్రి పట్టణంలో బొగ్గు లోడ్ తీసుకువెళుతున్న లారీలపై కవర్లు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ద్విచక్ర వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. బొగ్గు లోడ్ పైన టార్ఫాలిన్ కవరు కట్టాలనే నిబంధనలు అమలు కావడం లేదన్నారు. అధికారులు వెంటనే పర్యవేక్షణ చేపట్టి, బొగ్గు లోడుపై తప్పనిసరిగా కవరు కట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు.