మెగాస్టార్ చిరంజీవి పై ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ వేదికగా… చిరంజీవిని మోదీ కొనియాడటం విశేషం. ఇలా ప్రశంసలు కురిపించడానికి కారణం ఉంది. గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇఫ్ ఇండియాలో మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌవరం దక్కింది. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డును మెగాస్టార్‌కు ప్రకటించారు. ప్రకటించిన మరుక్షణం నుంచే మెగాస్టార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా మెగాస్టార్‌ను అభినందించారు. ఇంగ్లిష్తో పాటు తెలుగులో కూడా ట్వీచ్ చేశారు. చిరంజీవి గారు విలక్షణమైన నటుడని… అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించారని ప్రధాని గుర్తుచేశారు. కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ మెగాస్టార్ చూరగొన్నారని ప్రధాని మోడీ తెలిపారు. ప్రధాని అభినందనలపై చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.