KNR: తేలుకుంట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు KNR జిల్లా ప్రభుత్వాసుపత్రి వర్గాలు తెలిపాయి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం చీమలపేట గ్రామానికి చెందిన కుమార్ పెద్దాపురం నుంచి చీమలపేటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో గురువారం రాత్రి తేలుకుంట వద్దకు రాగానే అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.