CTR: వెదురుకుప్పం మండలం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వీఎం థామస్ తెలిపారు. ఈచర్య హేయమైనదని, ఘటన బాధాకరమని అన్నారు. ఎస్పీ, డీఎస్పీలతో మాట్లాడి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.