WGL: ఉమ్మడి జిల్లాలో స్థానిక ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కీలకం కానున్నాయి. 40 లక్షల జనాభాలో 18 లక్షల మహిళలుండగా, 8,663 మంది జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు పొందనున్నారు. హనుమకొండలో 996, జనగామలో 1,267, భూపాలపల్లిలో 1,051, ములుగులో 645, వరంగల్‌లో 1,377, మహబూబాబాద్‌లో 2,055 పదవులు మహిళలకు లభించనున్నాయి.