సత్యసాయి: కదిరిలో విజయదశమి పండుగ సందర్భంగా వసంతవల్లభుల స్వామివారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శమి పూజ మండపంలో శమివృక్ష పూజ, ఆయుధ పూజ, ఆస్థాన సేవలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని పుష్పాలంకరణతో ఆశ్వవాహనంపై ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరుమాడవీధుల్లో ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.