NLR: అహింసా మార్గంలో సత్యాగ్రహాన్ని ఆయుధంగా చేసుకుని, కోట్లాది భారతీయులకు స్వాతంత్రాన్ని అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొనియాడారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీకి ఎమ్మెల్యే ఘన నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలు అందరూ ఆచారించాలని ఆయన పిలుపునిచ్చారు.