కృష్ణా: సోలార్ విద్యుత్ వినియోగం పెరగాలని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం మోపిదేవిలో కొచ్చర్ల రాంబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సన్ రేస్ సోలార్ టెక్నాలజీస్‌ను వెంకట్రామ్ ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా సౌర విద్యుత్ వినియోగానికి అందిస్తున్న సబ్సిడీల గురించి విస్తృత ప్రచారం చేయాలని ఆయన తెలిపారు.