TPT: ఎస్వీ జూలాజికల్ పార్క్‌ను సీనియర్ ఐఏఎస్ అధికారి కాంతిలాల్ దాండే గురువారం సందర్శించారు. పార్క్‌లోని సదుపాయాలు జంతు సంరక్షణ ప్రమాణాలు, జరుగుతున్న సంరక్షణ కార్యక్రమాలను సమీక్షించేందుకు వచ్చామన్నారు. తన పరిశీలన సమయంలో పార్కు కార్యాచరణ, సంరక్షణ యూనిట్లపై ఆరా తీశారు. కొత్తగా వచ్చిన లేదా వైద్య పర్యవేక్షణలో ఉన్న జంతువులను ఉంచే క్వారంటైన్‌ను సందర్శించారు.