NZB: జక్రాన్పల్లి మండలం తొర్లికొండ న్యూ స్టార్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గా దేవి మండపం వద్ద అమ్మవారి చీరలకు వేలం నిర్వహించారు. నవరాత్రుల్లో దుర్గా దేవి అమ్మవారు జ్ఞాన సరస్వతి అవతారంలో పూజలు అందుకున్న రోజు అమ్మవారి చీరను రూ.15 వేలకు సందీప్ గౌడ్ వేలంలో దక్కించుకున్నారని నిర్వాహకులు తెలిపారు. దుర్గా దేవి మండప నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.