ASF: కాగజ్ నగర్ పట్టణంలోని రామకృష్ణ వివేకానంద సెంటర్లో గత 5 రోజులుగా జరుగుతున్న దుర్గా పూజ ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. గురువారం జరిగిన సింధూర్ ఖేలో ఉత్సవంలో MLA హరీష్ బాబు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి కృప వలన కాగజ్ నగర్ మీదుగా హౌరా వరకు ఎక్స్ప్రెస్ రైలు కల సాకారం అవుతుందన్నారు.