ADB: చెడుపై విజయం సాధించడమే దసరా పండగ ఉద్దేశమని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించినట్లుగా మనం కూడా చెడును విడిచి మంచి మార్గాన్ని అనుసరించాలని సూచించారు. ప్రజలందరికీ విజయదశమి సందర్భంగా విజయం చేకూరాలని ఆకాంక్షించారు.