MBNR: జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు విడుదలయ్యాక సన్మార్గంలో పయనించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఖైదీలు జైలు జీవితాన్ని సద్వినియోగం చేసుకుని, చదువుకుని నైపుణ్యాలు పెంపొందించుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్నారు.