TG: దసరా వేళ నల్గొండ జిల్లా చందంపేట మండలంలో తీవ్ర విషాదం నెలకొంది. దేవరచర్ల డిండి వాగులోకి దిగి ముగ్గురు మృతి చెందారు. వాగులోకి దిగిన సాయి(10) గల్లంతవడంతో.. కాపాడేందుకు వెళ్లిన రాము(30), గోపి(21) కూడా వాగులో కొట్టుకుపోయారు. పండగ సందర్భంగా తెనాలి నుంచి వచ్చిన వారు విగతజీవులుగా కనిపించడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.