కోనసీమ: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉదృతి పెరగడంతో ముమ్మిడివరం నియోజకవర్గం లంక గ్రామాలు నీట మునిగాయి. లంకాఫ్ ఠానేలంక, కూనలంక గ్రామాల్లో నివాస గృహలను వరద నీరు చుట్టుముట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్టోబర్ నెలలో కూడా వరదలు ముంచేత్తడంతో లంక గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు. ప్రదాన రహదారులపై వృద్ద గౌతమీ గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది.