CTR: నిండ్ర మండలం కచరవేడు గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిధిగా నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.