GNTR: స్వచ్ఛ అవార్డుల సాధనలో జిల్లా అగ్రస్థానంలో నిలవడం గర్వంగా ఉందని కలెక్టర్ తమీమ్ అన్సారియా కలెక్టరేట్లో ఇవాళ తెలిపారు. జిల్లాకు ఐదు రాష్ట్ర స్థాయి అవార్డులతోపాటు 48 జిల్లా స్థాయి అవార్డులు దక్కాయని ఆమె పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఈనెల 6వ తేదీన స్వచ్ఛ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.