ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని చోడవరంలో ఇవాళ 2.0 పల్లె పండుగలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల నుంచి గోకులం షెడ్‌కి శంకుస్థాపన చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు కేలం ఇంద్రభూపాల్ రెడ్డి స్థానిక టీడీపీ నాయకులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.