NLG: మిర్యాలగూడ పట్టణంలోని గురువారం గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు. గాంధీ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలిసి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సత్యం, అహింసలను అనుసరిద్దాం, మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం అని అన్నారు.