AP: స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని మంత్రి లోకేష్ తెలిపారు. ‘తుదిశ్వాస వరకు దేశం కోసం సేవలందించిన నిస్వార్థ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. నీతికి, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచారు. ఆయన దేశ అభ్యున్నతికి అందించిన సేవలను స్మరించుకుందాం’ అంటూ పోస్టు చేశారు.