రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విజయ దశమి సందర్భంగా గురువారం పట్టణంలోని సాయి బాబా ఆలయంలో గల జమ్మి చెట్టు శమి పూజలో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం బంగారం (జమ్మిని)పంచుతూ అలయ్ బలాయ్ తీసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.