W.G: కలెక్టరేట్లోని గోదావరి హాల్లో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం ఘనంగా జరిగింది. కలెక్టర్ వెట్రిసెల్వి ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. నిరాధరణకు గురైన వృద్ధులు తహసీల్దార్, ఆర్డీఓలను సంప్రదించి న్యాయం పొందవచ్చన్నారు. సేవలందించిన 15 మంది వృద్ధులను సత్కరించి, ఆటల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.