మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో భక్తిశ్రద్ధలతో దసరా పండుగను జరుపుకోవాలన్నారు. దసరా పండుగ వేళ అందరి ఇళ్లలో ఆనందం వెల్లివిరియాలని ఆయన కాంక్షించారు.