VZM: సంతకవిటి మండలం గోవిందపురం గ్రామంలో అదపాక లింగంనాయుడు(37) రాబిస్ లక్షణాలతో మృతి చెందాడు. లింగంనాయుడికి ఆగస్టు 30న వీధి కుక్క కరవడంతో.. PHCలో మూడు వ్యాక్సిన్లు వేయించుకున్నాడు. ఈ మధ్య అనారోగ్యానికి గురి కావడంతో రాబిస్ లక్షణాలు ఉన్నాయని విశాఖ తీసుకెళ్లారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.