NLG: సాగర్‌కు వరద ఉధృతి కొనసాగుతుండటంతో 26 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలకళను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. పర్యాటకుల భద్రతా చర్యలను DSP రాజశేఖర్ రాజు పరిశీలించారు. ప్రమాదకర ప్రాంతాల వద్ద పటిష్టమైన పోలీసు రక్షణ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.