VZM: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా.. ఆ ఇద్దరు మహనీయులకు నివాళి అర్పించే కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఉదయం 8.30 గంటలకు కలెక్టరేట్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, శాస్త్రి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తామని తెలిపారు.