కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గురువారం పర్యటన వివరాలను ఎమ్మెల్యే సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు కొత్తపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు జరిగే మహాత్మాగాంధి జయంతి వేడుకలలో పాల్గొంటారు. 11 గంటలకు పలివెల శ్రీ ఉమాకొప్పులింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు పెదపళ్ళ గ్రామంలో పర్యటిస్తారు.